కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయాన్ని త్వరలో పూర్తి చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. చెన్నై- హైదరాబాద్- బెంగళూరు కారిడార్‌లో భాగంగా ఓర్వకల్లును నోడ్‌గా ప్రకటించామన్నారు. అందులో భాగంగా ఎయిర్ పోర్టును పూర్తి చేస్తామని వివరించారు.
ఓర్వకల్లు విమానాశ్రయాన్ని త్వరలో పూర్తి చేస్తాం: మంత్రి బుగ్గన - ఓర్వకల్లు విమానశ్రయం న్యూస్
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఓర్వకల్లు విమానాశ్రయాన్ని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.

ఓర్వకల్లు విమానాశ్రయాన్ని త్వరలో పూర్తి చేస్తాం