ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతిపై మంత్రి బొత్స మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు - amaravathi

రాజధానిపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి బొత్స ఈ విషయంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ముంపు ప్రాంతమని మరోసారి స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం, ఇటీవల ఆ ప్రాంతం ముంపునకు గురైందని వెల్లడించారు.

మంత్రి బొత్స

By

Published : Aug 28, 2019, 5:51 PM IST

మీడియాతో మంత్రి బొత్స

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ మధ్యనే వచ్చిన వరదలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని ఆయన వెల్లడించారు. రాజధాని విషయంలో గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని.. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని ముంపునకు గురవుతుందని చెప్పడంలో తప్పేముందని కర్నూలు కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షలో అన్నారు. రాజధానిపై జరుగుతున్న చర్చల్లో తనకెలాంటి సంబంధం లేదన్నారు.

కేంద్ర జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా ఏపీ తాగునీటి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని దీని ద్వారా రాష్ట్రమంతటా తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పథకాన్ని రెండు దశల్లో చేపట్టనుండగా... మొదటి దశలోనే కర్నూలులో అమలు చేస్తామని తెలిపారు. త్వరలో సాగునీటి సలహా మండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details