ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు. పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు కర్నూలు వచ్చిన ఆయన..ఆదోని జమియా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కర్నూలుకు బయల్దేరి వెళ్లారు. రేపు ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి మరోసారి ఆదోని రానున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఆదోనిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పర్యటన - ఆదోనిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పర్యటన తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఆదోనిలో ఎంఐఎం పార్టీ అధినేత ,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించి జమియా మసీద్‌లో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. అనంతరం కర్నూలు బయల్దేరిన ఆయన.. రేపు ఆదోనిలో నిర్వహించనున్న పురపాలక ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.

ఆదోనిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పర్యటన