కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు జరిగాయి. పట్టణంలోని దివ్య జ్ఞాన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మందిరం పీఠాధిపతి మహబూబ్ సాహెబ్ చిస్తీ సాబీరీ భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త సందేశాలు పాటించాలన్నారు. దైవ మార్గం ప్రవక్త పద్ధతులు పాటించిన వారే ఇహ,పరలోకాల్లో విజయం సాధిస్తారన్నారు. మంచి చేసే వారికి అల్లా అండగా ఉంటారని తెలిపారు. అత్యాశ ఎప్పటికీ మంచిది కాదని... దేవుడిచ్చిన దానితో తృప్తి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు - milad un nabhi celebrations at allagadda in karnool district news
ఆళ్లగడ్డలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ప్రసంగిస్తున్న మహబూబ్ సాహెబ్ చిస్తీ సాబీరీ
ఆళ్లగడ్డలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు