పొట్టకూటి కోసం మూడు నెలల కిందట గుంటూరు జిల్లాకు వలస వెళ్లిన కర్నూలు జిల్లా వాసులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. అధికారులు వీరిని ప్రత్యేక బస్సుల్లో కోడుమూరుకు చేర్చారు. స్థానిక కస్తూర్బా పాఠశాలలో వలస కూలీల ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బంది ఆరా తీశారు. ఎంపీడీఓ మంజులవాణి, ఈవో వెంకటేశ్వర్లు వలస కూలీలతో మాట్లాడారు. ఇళ్లకు చేరిన తర్వాత బయటకు రాకూడదని సూచించారు. ఇళ్లల్లో కూడా వ్యక్తిగత దూరం పాటించాలని సూచించారు. అనంతరం కూలీలను ఆటోల్లో వారి వారి ఇళ్లకు చేర్చారు.
గుంటూరు నుంచి కోడుమూరు చేరిన వలస కూలీలు - kurnool migrant labours news
ఉపాధి కోసం 3 నెలల కిందట గుంటూరు జిల్లాకు వలస వెళ్లిన కర్నూలు వాసులు ఎట్టకేలకు సొంతగూటికి చేరుకున్నారు. వీరిని ప్రత్యేక బస్సుల్లో అధికారులు స్వగ్రామాలకు చేర్చారు.

గుంటూరు నుంచి కోడుమూరు చేరిన వలస కూలీలు
TAGGED:
kurnool migrant labours news