ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైకిళ్లపై వలస కూలీల సుదూ...ర ప్రయాణం! - కర్నూలులో వలస కూలీల వార్తలు

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. వ్యయప్రయాసలకు ఓర్చి సొంత గూటికి చేరాలన్న లక్ష్యంతో సుదూర ప్రయాణం సాగిస్తున్నారు. కర్నూలులో ఓ ప్రైవేట్​ కంపెనీలో పని చేస్తున్నామని, యాజమాన్యం జీతాలు ఇవ్వని కారణంగా.. ఉన్న డబ్బులతో సైకిళ్లు కొనుక్కుని ఝార్ఖండ్​కు బయలుదేరామని వలస కూలీలు తెలిపారు.

migrant labourers faceing problems
జార్ఖండ్​కు సైకిళ్లపై వలస కూలీల ప్రయాణం

By

Published : May 18, 2020, 12:45 PM IST

తిన్నా.. తినకపోయినా.. ఆఖరికి మంచి నీళ్లు కూడా లేకపోయినా.. స్వగ్రామం చేరుకోవటమే లక్ష్యంగా.. వలస కార్మికులు కష్టాల కడలి ఈదుతున్నారు. కర్నూలులో చిక్కుకుపోయిన ఝార్ఖండ్ రాష్ట్ర వలస కూలీలు.. తమ దగ్గర ఉన్న కాసిన్ని డబ్బులతో సైకిళ్ళు కొనుగోలు చేసి ప్రయాణం ప్రారంభించారు.

ఐదు రోజుల క్రితం ప్రయాణం ప్రారంభించి ప్రకాశం జిల్లా దర్శికి చేరుకున్నారు. రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దారిలో తినడానికి తిండి, నీళ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిని గమనించిన దాతలు ఇచ్చే ఆహారంతో సరిపెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details