ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందికొట్కూరులో వలస కూలీల అడ్డగింత - corona virus

వివిధ ప్రాంతాల నుంచి స్వగృహాలకు చేరుకున్న వలస కార్మికులను కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఎస్​ఐ పాలెంలో స్థానిక నాయకులు అడ్డుకున్నారు. క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాతే గ్రామంలోకి అనుమతిస్తామని తేల్చి చెప్పారు.

Migrant laborers seeking refuge in a dormitory
వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న వలస కూలీలు

By

Published : Apr 14, 2020, 12:26 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఎస్ఐ పాలేనికి చెందిన 22 మంది వలసకూలీలను స్థానిక నాయకులు అడ్డుకున్నారు. క్వారంటైన్ లేకుండా గ్రామంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తమకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఇళ్లకు పంపించాలని వలస కూలీలు డిమాండ్ చేశారు. పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details