కొందరు కూలీలు నడకతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. దారిలో ఏదైనా వాహనాలు వస్తే వాటిలో వెళుతూ కొన్ని చోట్ల నడుస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. కొన్నిసార్లు పోలీసులు అడ్డుకుని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తరలిస్తున్నారు. ఇలా వచ్చే క్రమంలో సరైన ఆహారం లేక అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు కొందరు కూలీలు అనారోగ్యానికి గురై సకాలంలో వైద్యం అందక మృతిచెందుతున్నారు. పనుల కోసం వచ్చి అనారోగ్యంతో అసువులు బాసి అయిన వారికి అంతులేని ఆవేదనను కలిగిస్తున్నారు. వలసకూలీలు సొంతూళ్లకు పంపాలని పదేపదే అధికారులను వేడుకుంటున్నారు.
గుంటూరు జిల్లాలో మిర్చి కోతలకు కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల నుంచి సుమారు 30వేల మంది కూలీలు వచ్చారు. వీరు జనవరిలో వచ్చి మార్చి నెలాఖరు వరకు మిర్చి కోతల పనులు చేసుకుని సొంతూళ్లకు వెళతారు. వీరు ఇళ్లకు పయనమయ్యే సమయానికి లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ఇక్కడే ఉండిపోయారు. మిర్చి కోతలు చివరికి రావడంతో పనులు లేక తాత్కాలిక గుడారాల్లోనే నివసిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు సొంతూళ్లో ఉండి పోవడంతో వారి పరిస్థితి ఎలాగుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరకులు, కూరగాయలు పంపిణీ చేయడానికి అధికారులు, దాతలు వచ్చినప్పుడు సొంతూళ్లకు పంపించాలని కాళ్లా వేళ్లా పడుతున్నారు. పెదకూరపాడు మండలానికి కర్నూలు జిల్లా నుంచి 6800 మంది కూలీలు వచ్చారు. వీరిని పంపడానికి ఇక్కడి యంత్రాంగం సిద్ధమైనా అంతమందిని పంపలేమని అక్కడి యంత్రాంగం చెప్పడంతో ఆగిపోయారు. కొందరు కాలినడకన వెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు గుర్తించి వెనక్కి తీసుకువచ్చారు.
రాలిపోతున్న ప్రాణాలు
గుంటూరు జిల్లా
సత్తెనపల్లి మండలం కంటెపూడికి చెందిన 30 కుటుంబాల వారు పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో పొగాకు బ్యారెన్ పనులకు వెళ్లారు. వీరంతా ఈనెల 17న అక్కడి నుంచి ఒక లారీలో కంటెపూడి సమీపం వరకు ప్రయాణించారు. కంటెపూడి సమీపంలో పోలీసు చెక్‌పోస్టు ఉండటంతో కొంతదూరం ముందు లారీ దిగి పొలాల గుండా గ్రామానికి నడుకుచుకుని వెళ్లే క్రమంలో వెదుళ్లపల్లి వెంకటేశ్వర్లు(65) పొలంలో హద్దురాయి తగిలి కింద పడిపోయారు. సత్తెనపల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా మృతిచెందారు.
ప్రకాశం జిల్లా