ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బరువైన బతుకులు.. సొంతగూటి వైపే అడుగులు! - ముంబైలో కర్నూలు వలస కూలీల వార్తలు

పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. కరోనా కోరల్లో చిక్కుకుని ఆకలికి అలమటించి.. అన్నార్తుల దగ్గర చేయిచాచి... చివరికి సొంతగూటికి చేరుకుంటున్నారు వలస కూలీలు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో.. మహారాష్ట్రలోని కర్నూలు వలస కూలీలు.. ఎట్టకేలకు జిల్లాకు చేరుకున్నారు.

Migrant laborers came to ap from mumbai
ముంబై నుంచివలస కూలీలు ఎపికి

By

Published : May 24, 2020, 7:52 PM IST

కర్నూలు జిల్లా నుంచి మహారాష్ట్రకు వలస వెళ్లిన కూలీలు సొంత జిల్లాకు చేరుకున్నారు. దాదాపు 1300 మంది మహారాష్ట్రకు వెళ్లగా వారిని శ్రామిక్ రైలులో కర్నూలు జిల్లాకు అక్కడి ప్రభుత్వం పంపించింది. కర్నూలు జిల్లాతో పాటు ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు కుడా చేరుకోగా.. వారిని అక్కడి జిల్లాలకు ఆర్టీసీ బస్సుల్లో తరలించారు.

కర్నూలు జిల్లాకు చెందిన వారిని కర్నూలు, ఆదోని, నంద్యాల క్వారంటైన్​ భవనాలకు తరలించామని.. ఎంపీ. డాక్టర్. సంజీవ్ కుమార్ తెలిపారు. రెండు నెలలుగా ఇబ్బందులు పడ్డామని ప్రభుత్వం స్పందించి సొంత జిల్లాకు తీసుకుని వచ్చినందుకు కృతజ్ఞతలనీ వలస కూలీలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details