కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడెకల్ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బోయ వెంకటేష్(35) జూన్15న అదృశ్యం కాగా సోమవారం రాత్రి గ్రామం చెంతనే ఉన్న చెరువులో శవమై కనిపించాడు. మృతుడి భార్య కొండమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 19న కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి చెరువులో పడేసినట్లు వారు అనుమానిస్తున్నారు. గ్రామీణ ఎస్సై సునీల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమా? ఇంకా ఏవైనా కారణాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
వారం క్రితం అదృశ్యం.. చెరువులో మృతదేహం.. - emmiganuru latest news
వారం క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి అదే గ్రామంలోని చెరువులో శవమై తేలాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతణ్ని హత్య చేసి గోనే సంచిలో మూటకట్టి చెరువులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.
men murder in gudekal