కర్నూల్ జిల్లా డోన్ మండలం అబ్బిరెడ్డి పల్లె చెరువులో పడి లష్కర్గా పని చేస్తోన్న రాజన్న అనే వ్యక్తి మృతిచెందాడు. చెరువు తూములో నీళ్లు లీకేజీ అవుతుండడంతో ఇసుక సంచులు వేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. గ్రామస్థులు ఎంతగాలించినా దొరకక పోవడంలో పోలీసులకు సమాచారమిచ్చారు.
అబ్బిరెడ్డిపల్లె చెరువులో పడి లష్కర్ మృతి - అబ్బిరెడ్డిపల్లి చెరువులో పడి లష్కర్ మృతి
కర్నూలు జిల్లా అబ్బిరెడ్డిపల్లె చెరువులో పడి లష్కర్ మృతిచెందాడు. చెరువు తూములో నీటి లీకేజీ ఎక్కువగా ఉండడంతో ఇసుక బస్తాలు అడ్డుగా వేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు.
అబ్బిరెడ్డిపల్లి చెరువులో పడి లష్కర్ మృతి
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రాజన్న ఇసుక సంచుల కింద ఇరుక్కుని ఊపిరి ఆడక మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. రాజన్న మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.
ఇదీ చదవండి:Case Filed: పెసరవాయి జంట హత్యల కేసు..13 మందిపై కేసు నమోదు