కర్నూలు జిల్లా నంద్యాల నవ నిర్మాణ సమితి సభ్యులు దాతల సహకారంతో స్వర్గధామం పేరిట కర్నూలు జిల్లా నంద్యాలో హిందూ స్మశానవాటికలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలు జ్ఞాపకార్థం 400 చెట్లతో ఈ స్మృతివనం ఏర్పాటు చేశారు.
బాలు పాటలతో చెట్లు..
నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సబ్ కలెక్టర్ కల్పనకుమారి తదితరులు హాజరై చెట్లను నాటారు. చెట్ల వద్ద పేరొందిన పాట సూచికను ఏర్పాటు చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది. బాలు పాడిన చిలుకా క్షేమమా, ఏ కులం నీదంటే గోకులం, ఇదే నా మొదటి ప్రేమలేఖ, సిరి మల్లె పువ్వల్లే నవ్వు ఇలా సందేశాత్మక పాటల పేర్లు రాసి చిత్రం పేరుతో చెట్టు వద్ద సూచిక ఉంచారు.
ఆయన లేని లోటు పూడ్చలేనిది..