కర్నూలు జిల్లా నంద్యాలలోని వీరభద్ర షాపింగ్‌మాల్ వారు 21 రూపాయికే చీర అని ప్రకటించారు. ఆఫర్ విషయం తెలుసుకుని ఉదయం నుంచే మహిళలు భారీ ఎత్తున షాపు దగ్గరకు చేరుకున్నారు. కరోనా వేళ పరిస్థితి అదుపు తప్పి ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
నంద్యాలలో ఇరవై ఒక రూపాయలకే కాటన్ చీర - నంద్యాలలో తక్కువ ధరకే చీర
మహిళలకు చీరలంటే ఎంతో ప్రాణం... డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎంత దూరమైనా వెళ్తారు... వారికి ఎన్ని చీరలు ఉన్నా.. ఆఫర్లు ఉంటే మరిన్నీ చీరలు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 10శాతం, 20 శాతం డిస్కౌంట్ ఇస్తేనే.. రెండు, మూడు చీరలు కొనాలనుకుంటారు. అలాంటిది రూ.21కే చీర ఇస్తామంటే మహిళలు ఆగుతారా... అందుకే ఆ షాపు దగ్గరకు భారీ ఎత్తున తరలివచ్చారు.
బారులు తీరిన జనం
పోలీసుల జోక్యంతో యాజమాన్యం ఆఫర్ లేదని ప్రకటించింది. దీంతో మహిళలంతా భారీ ఆఫర్ పోయిందే అనుకుంటూ వెనుదిరిగారు.
ఇదీ చదవండీ..పురుషుడికి వితంతు పింఛన్ .. ఏళ్లు గడిస్తే కానీ గుర్తించని అధికారులు
Last Updated : Apr 8, 2021, 12:45 PM IST