కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో ఈ నెల 28 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానునున్నాయి. మార్చి 10 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసే ప్రక్రియలో భాగంగా అన్ని శాఖల అధికారులతో నంద్యాల సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ రెడ్డి, ఆలయ అధికారి మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రవాణా వంటి సౌకర్యాల ఏర్పాట్లపై చర్చించారు. బ్రహ్మోత్సవాల్లో ప్లాస్టిక్ వాడకూడదని ఎమ్మెల్యే సూచించారు. ఉత్సవాల్లో నాటుసారా, మద్యం అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అహోబిలం బ్రహ్మోత్సవాలపై అధికారుల సమీక్ష - అహోబిలం బ్రహ్మోత్సవాలపై అధికారుల సమన్వయ సమావేశం
అహోబిలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాలలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
అహోబిలం బ్రహ్మోత్సవాలపై సమన్వయ సమావేశం