కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని నగర మేయర్ బీ.వై.రామయ్య కోరారు. నగరంలోని చెత్త సేకరణకు నూతనంగా కొనుగోలు చేసిన పది వాహనాలతో పాటు ఒక హిటాచీ వాహనాన్ని స్థానిక ఎమ్మెల్యేలు హాఫీజ్ ఖాన్, డాక్టర్ సుధాకర్, కాటసాని రాంభూపాల్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
నగర రోడ్లపై చెత్త పడేయకుండా కార్పొరేషన్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చెత్త వేయాలని సూచించారు. ప్రజల సహకారంతో కర్నూలును క్లీన్ సిటీతో పాటు గ్రీన్ సిటీగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.