ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో భారీ చోరీ.. బంగారం, వెండి, నగదు అపహరణ - ఆదోనిలో రెండు ఇళ్లలో భారీ చోరీ-బంగారం,వెండి,నగదు అపహరణ

కర్నూలు జిల్లా ఆదోనిలోని రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ల తాళాలు పగులగొట్టి 40 గ్రాముల బంగారం, 300 తులాల వెండి, లక్షా 75 వేలు నగదు అపహరించారు.

Massive theft of gold, silver and cash from two houses in Adoni
ఆదోనిలో రెండు ఇళ్లలో భారీ చోరీ-బంగారం,వెండి,నగదు అపహరణ

By

Published : Oct 16, 2020, 2:57 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ చోరీ జరిగింది. గజ్జహళ్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ రెడ్డి పిల్లల ఉన్నత చదువుల కోసం ఆరేళ్లుగా ఆదోనిలో ఉంటున్నారు. పొలం పనుల కోసం అతను స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అతని భార్య వనిత బంధువుల ఇంటికి వెళ్లింది. గమనించిన దుండగులు ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి 40 గ్రాముల బంగారం, 300 తులాల వెండి, లక్షా 75 వేలు నగదు గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు బాధితుడు వాపోయాడు. దొంగతనం జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో జరిగిన దొంగతనాన్ని పరిశీలించి వెళ్లారు.

అదే కాలనీ మరో ఇంట్లో కూడా చోరీ జరిగింది. 50 గ్రాముల బంగారం,40 వేలు నగదు చోరీ చేశారని బాధితుడు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details