ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే వేదికపై 220 జంటలకు సామూహిక వివాాహా వేడుకలు.. ఎక్కడంటే?

Mass marriages under MJR Trust: పచ్చని తోరణాలు, విశాలవంతమైన పెళ్లిమండపంలో వేద మత్రాలు సాక్షిగా 220 జంటలు ఒకే సుముహూర్తానికి ఒక్కటయ్యారు. ఈ వివాాహ వేడుకులను చూడడానికి వేలాదిగా వచ్చిన జనంతో ఆ ప్రాంతం దేవతల పెళ్లి జరిగినట్లు కనిపించింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Mass marriages under MJR Trust
సామూహిక వివాాహా వేడుకలు

By

Published : Feb 12, 2023, 10:36 PM IST

Mass marriages under MJR Trust: తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఎంజేఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాాహా వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వారి సతీమణి జమునరాణి, ట్రస్ట్ ఆధ్వర్యంలో జెడ్పీ హై స్కూల్ మైదానంలో సామూహిక వివాాహాలు ఏర్పాటు చేశారు. వేడుకల్లో 220 జంటలు ఒక్కటయ్యాయి. సాంప్రదాయ పద్దతిలో పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు ముందుండి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.

భారీగా వేసిన మండపాల్లో సుమూహూర్తాన 220 జంటలు ఒక్కటి అయ్యాయి. ఈ వేడుకలకు ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిమంది ప్రజలు పెళ్లిని తిలకించేందుకు తరలివచ్చారు. ప్రజలందరికీ విందు భోజనాలు అందించారు. జంటలకు ఇప్పటికే పట్టువస్త్రాలు, తాళి, మెట్టెలు కూడా అందించారు. వివాహం అనంతరం జంటలకు బీరువా, మంచం, బెడ్‌తో పాటు ఇతర వంట సామాగ్రి అందచేశారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా పేదల సేవకోసo ట్రస్ట్ స్థాపించానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆడ బిడ్డల పెళ్లిళ్లకు పేదలు పడుతున్న ఇబ్బందులు చూశానని.. తన ఇంట్లోనూ పేదరికాన్ని అనుభవించాను అని అన్నారు. ఇప్పటికే 485జంటలకు సామూహిక వివాహలు జరిపించానని వివరించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. . ఇంత వైభవంగా వివాహాలు చేయడం అద్భుతమని ఎంపీ కేశవరావు పేర్కొన్నారు.

మర్రి జనార్దన్ రెడ్డి సేవలు ప్రశంసనీయని ఎంపీ నామా నాగేశ్వరరావు కొనియాడారు. పెళ్లిళ్లను చూడటం చాలా‌ సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ శాంతకుమారి, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు గువ్వల బాలరాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఒకే వేదికపై 220 జంటలకు సామూహిక వివాాహా వేడుకలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details