భర్త వేధింపుల కారణంగానే ఓ మహిళ మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపించారు. కర్నూలుకు చెందిన సురేశ్, మీనాక్షి దంపతులు తిరుపతిలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నిన్న రాత్రి మీనాక్షి అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతదేహాన్ని సురేశ్ సోమవారం భార్య స్వగ్రామం అయిన కర్నూలు జిల్లా ఆదోని తీసుకువచ్చాడు. అయితే భర్తే ఆమె మరణానికి కారణం అని ఆమె బంధువులు ఆరోపించారు. గతంలోనూ కట్నం తీసుకురావాలని మీనాక్షిని వేధించేవాడని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు సురేశ్ మృతదేహంతో పాటు లాయర్లను వెంటపెట్టుకు రావటంతో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Death mistry: మహిళ మృతి.. భర్తే కారణం అంటున్నబంధువులు - adhoni women died in thirupathi
అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. భర్త వేధింపుల కారణంగానే మరణించినట్లు ఆమె బంధువులు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ ఘటన జరిగింది.
మహిళ మృతి