ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాలంలో ఒక్కటైన జంట - కర్నూలులో వివాహం

కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ అంతా లాక్​డౌన్ అమల్లో ఉంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో అనేక వివాహాలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. కానీ కొందరు మాత్రం వివాహాలు చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా లో ఓ జంట అధికారుల అనుమతి తీసుకుని ఒక్కటైంది.

marriage in kurnool
marriage in kurnool

By

Published : May 7, 2020, 8:01 PM IST

కరోనా కాలంలో ఓ జంట వివాహం చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల మండలం సుబ్బారెడ్డిపాలెం గ్రామంలో ఈ వివాహం జరిగింది. గ్రామానికి చెందిన గమన అనే వధువు, ఆళ్లగడ్డ ప్రాంతం సుద్దమల్లకు చెందిన శ్రీధర్ రెడ్డి అనే వరుడు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అధికారుల అనుమతి తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details