సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మార్కెట్ శాఖ జేడీ - kurnool district latest news
ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ శాఖ జేడీ సుధాకర్ తనిఖీ చేశారు. ఆదోని, నంద్యాల, పెంచికలపాడు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష 60 వేల క్వింటాలు కొనుగోలు చేశామని అన్నారు.
![సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మార్కెట్ శాఖ జేడీ Marketing department Jedi Sudhakar inspects CCI buying center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9907078-787-9907078-1608183587696.jpg)
సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ శాఖ జేడీ సుధాకర్ తనిఖీ
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ శాఖ జేడీ సుధాకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రం ద్వారా 3,118 మంది రైతుల నుంచి 69 వేల క్వింటాలు కొనుగోలు చేసినట్లు జేడీ వెల్లడించారు. ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, పెంచికలపాడు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష 60 వేల క్వింటాలు కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. జేడీ వెంట సీసీఐ అధికారి చంద్రకాంత్, మార్కెట్ సూపర్ వైజర్ రాము ఉన్నారు.