కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. మఠ పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ధ్వజారోహణ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపూజ, ధాన్య పూజ నిర్వహించారు. మూలరాములకు ఊంజల సేవ చేశారు. కరోనా కారణంగా మఠంలోకి సిబ్బందిని మాత్రమే అనుమతించారు. ఉత్సవాల్లో ఈసారి గ్రామస్థులు, భక్తులు పాల్గొనవద్దని పోలీసులు ప్రకటించారు. సోమవారం నుంచి మంత్రాలయంకు వెళ్లే అన్ని రహదారులను మూసివేయనున్నారు.
నిరాడంబరంగా రాఘవేంద్రస్వామి 349వ ఆరాధనోత్సవాలు - మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఉత్సవాలు
కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఉత్సవాల్లో ఈసారి గ్రామస్థులు, భక్తులు పాల్గొనవద్దని పోలీసులు ప్రకటించారు.
మంత్రాలయం