కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉన్న పుణ్యక్షేత్రం రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధి కోసం రూ. 2 వేల కోట్లతో బృహత్ ప్రణాళిక రూపొందించినట్లు పీఠాధిపతి సుభుదేంద్ర స్వామి తెలిపారు. రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి 27వరకు జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి పనులను వివరించారు. ఉత్సవాల సందర్భంగా నూతనంగా సభా ప్రాంగణం ప్రారంభించనున్నారు. రూ. 6 కోట్లతో చేపట్టిన మహా ముఖద్వారం విస్తరణ పనుల శంకుస్థాపన.. 14 కిలోలతో తయారు చేసిన బంగారు పాత్రలను సమర్పించనున్నారు. వీటితోపాటు మంత్రాలయాన్ని ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
'రూ.2 వేల కోట్లతో రాఘవేంద్రస్వామి మఠం అభివృద్ది' - mantralayam subudendra swamy news
రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లతో బృహత్ ప్రణాళికను రూపొందించినట్లు మఠం పీఠాధిపతి సుభుదేంద్ర స్వామి తెలిపారు. రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి 27 వరకు జరగనున్న నేపథ్యంలో అభివృద్ధి పనులను వివరించారు.
mantralayam raghavendra matam news