ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర పుష్కర ఘాట్లు.. భక్తులు లేక వెల వెలబోతున్నాయి. మఠం వద్ద, వీవీఐపీ పక్కన, సంత వీధి ఘాట్లలో భక్తులు స్వల్ప సంఖ్యలో ఉన్నారు. వినాయక, ఎన్ఏపీ, కాచాపురం, రాంపురం, గురుజాల, నాగలదిన్నె ఘాట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఆరవ రోజు పుష్కరాల్లో.. అధికారులు ఉహించిన దాని కన్నా స్వల్ప సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
నిర్మానుష్యంగా మంత్రాలయం పుష్కర ఘాట్లు - అంతంతమాత్రంగానే మంత్రాలయం పుష్కర ఘాట్లలో భక్తులు
కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరుగుతున్న తుంగభద్ర పుష్కరాలకు.. భక్తులు అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. కొన్ని చోట్ల భక్తులు లేక ఘాట్లు నిర్మానుష్యంగా మారాయి.
వెలవెలబోతున్న పుష్కర ఘాట్లు