సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై సామాజిక మాధ్యమంలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన కేసులో హైదరాబాద్‌కు చెందిన హరినాథ్‌రెడ్డి అనే వ్యక్తిని కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అరెస్టు చేశారు. మంత్రాలయానికి చెందిన రాంపోగు వినోద్ అనే వ్యక్తి.. జులై 13న ఫేస్బుక్లో సీఎం, డీజీపీపై అసభ్యకర పోస్టులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. చరవాణి ఆధారంగా సదరు వ్యక్తిని కర్ణాటకలోని కొప్పల్‌లో ఉండగా గుర్తించి అరెస్టు చేశారు.
సీఎం, డీజీపీపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్టు
ముఖ్యమంత్రి జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అరెస్టు చేశారు. మంత్రాలయానికి చెందిన ఓ వ్యక్తి.. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు వ్యక్తిని కర్ణాటకలో గుర్తించి పట్టుకున్నారు.
సీఎం, డీజీపీపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్టు