దేశంలోని ప్రముఖ స్వచ్ఛ స్థలాల జాబితాలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆలయానికి చోటు దక్కింది. ఎంపిక ప్రక్రియ మూడో దశలో మంత్రాలయాన్ని ఎంపిక చేసినట్లు.... లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రతన్‌లాల్ కటారియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మూడో దశలో 10 స్వచ్ఛ స్థలాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మంత్రాలయంలో వంద శాతం ఓడీఎఫ్ సాధనకు మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. సీసీటీవీల ఏర్పాటుతో భక్తుల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. అయిదు వేల మొక్కలు నాటి రెండు ఉద్యానవనాలు తీర్చిదిద్దుతామని.... కొత్త ఆసుపత్రి భవనం, స్నాన ఘట్టాల నిర్మాణం చేపడతామని లిఖితపూర్వక సమాధానంలో రతన్‌లాల్ కటారియా వెల్లడించారు.
ప్రముఖ స్వచ్ఛ స్థలాల జాబితాలో మంత్రాలయానికి చోటు - ప్రముఖ స్వచ్ఛ స్థలాల జాబితాలో మంత్రాలయం వార్తలు
దేశంలోని ప్రముఖ స్వచ్ఛ స్థలాల జాబితాలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆలయానికి చోటు దక్కింది. ఎంపిక ప్రక్రియ మూడో దశలో మంత్రాలయాన్ని ఎంపిక చేసినట్లు.... లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రతన్‌లాల్ కటారియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
![ప్రముఖ స్వచ్ఛ స్థలాల జాబితాలో మంత్రాలయానికి చోటు mantralaya-is-on-the-list-of-popular-clean-places](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5356568-1029-5356568-1576180269280.jpg)
mantralaya-is-on-the-list-of-popular-clean-places