ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్చెన్న హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: మందకృష్ణ - కడప డాక్టర్ అచ్చన్న హత్య కేసు

Manda krishna Madiga on Achchenna murder case: కడప జిల్లా పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మరోవైపు ఉండవల్లి శ్రీదేవిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని ఏపీ ఎమ్మార్పీఎస్ హెచ్చరించింది.

Manda krishna Madiga
మందకృష్ణ మాదిగ

By

Published : Mar 30, 2023, 10:10 PM IST

Manda krishna Madiga on Achchenna murder case: కడప జిల్లా పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసులో సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపి.. న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కర్నూలులోని అచ్చెన్న కుటుంబ సభ్యులను మందకృష్ణ మాదిగ పరామర్శించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజు సీసీ కెమెరాలు పని చేయడం లేదని చెప్పారని.. హత్య జరిగిన తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాప్ చేసిన ప్రాంతంలో నిందితులను గుర్తించామని పోలీసులు చెప్పడం ఏంటని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి.. అచ్చన్న కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. తన తండ్రి హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్న కుమారుడు క్లింటన్ కోరారు. ఈ కేసులో పోలీసు శాఖ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రనాథ్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

"హత్యలో పాల్గొన్న నిందితులు ఎవరున్నారో.. వారితో పాటు పశువైద్యానికి సంబంధిచిన డైరక్టర్ అమరేంద్రనాథ్ పాత్ర కూడా పరోక్షంగా కనిపిస్తోంది. ఇద్దరి పాత్రలపైన నిగ్గు తేలాలంటే స్వతంత్రమైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం తప్ప.. మరే విధంగా చేసినా నిందితులు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. చర్యలు చేపట్టకపోను.. పరోక్షంగా వారిని కాపాడటానికే ఉన్నట్టుగా పైఅధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయి. కిడ్నాప్ అయినప్పుడు సీసీ కెమెరాలు లేవు అన్నారు కదా.. హత్య పది రోజులకు వెలుగులోకి వచ్చింది కదా.. మరి అప్పుడు సీసీ కెమెరాలు ఎలా వచ్చాయి". - మందకృష్ణ మాదిగ. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు.

అచ్చెన్న హత్య కేసును సిట్టింగ్ జడ్జ్​తో విచారించాలి: మందకృష్ణ

ఎమ్మెల్యే శ్రీదేవిపై దుష్ప్రచారం సరికాదు: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె కుమార్తెలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర రావు మాదిగ హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిందన్న అనుమానంతో.. వైసీపీ అధిష్టానం తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు.

అంతటితో ఆగకుండా కొందరు శ్రీదేవిని కులం పేరుతో దూషిస్తూ, సభ్యసమాజం తలదించుకునేలా బూతులు తిడుతూ.. సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. ఇలా అవమానిస్తుంటే దిశ చట్టం ఏమైనట్టు, మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్లు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత ఎమ్మెల్యే ఇంటిపై దాడులు చేయడం రాజకీయ వివక్ష కాదా అని ప్రశ్నించారు. శ్రీదేవికి మద్దతుగా దళిత గిరిజనులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details