ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HOUSE TAX: ఆస్తి పన్ను చూసి బిత్తరపోయిన యజమాని.. ఇంత ఎలా కట్టాలంటూ ఆవేదన..! - కర్నూలు జిల్లా తాజా వార్తలు

HOUSE TAX: అతనొక సాధారణ టీ దుకాణం నడుపుకునే వ్యక్తి.. అయితే ఆరేళ్ల క్రితం ప్రమాదానికి గురికావడంతో.. స్నేహితులు హైదరాబాద్‌ తీసుకెళ్లి... వైద్యం చేయించి ప్రాణాలు కాపాడారు. ఆరోగ్యం కాస్తా కుదుటపడ్డాక తిరిగి దుకాణం ప్రారంభించారు. అయితే తాజాగా నగరపాలక సంస్థ అధికారులు ఆయనకు ఆస్తి పన్ను చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. అది చూసి అతను బిత్తరపోయాడు.

HOUSE TAX
ఆస్తి పన్ను చూసి బిత్తరపోయిన యజమాని

By

Published : May 26, 2022, 9:21 AM IST

Updated : May 26, 2022, 10:08 AM IST

HOUSE TAX: రాష్ట్రంలో పెరిగిన ఆస్తి పన్నులు సాధారణ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గతంలో వందల్లో వచ్చే పన్ను ఇప్పుడు వేలల్లో వస్తోంది. సకాలంలో పన్ను చెల్లించకపోతే వడ్డీల మీద వడ్డీలు వేసి భారం వేస్తున్నారు. కర్నూలులో ఓ పాత రేకుల షెడ్డుకు లక్షా 30 వేలకు పైగా ఆస్తి పన్ను రావడంతో కట్టలేనంటూ ఆ యజమాని లబోదిబోమంటున్నారు.

ఆస్తి పన్ను చూసి బిత్తరపోయిన యజమాని

కర్నూలు శివారు వీకర్ సెక్షన్‌ కాలనీకి చెందిన వాసు అనే వ్యక్తి రేకుల షెడ్డులో టీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆరేళ్ల క్రితం ప్రమాదానికి గురికావడంతో.. స్నేహితులు హైదరాబాద్‌ తీసుకెళ్లి... వైద్యం చేయించి ప్రాణాలు కాపాడారు. అనారోగ్యానికి తోడు అప్పులు ఉండటంతో ఇంటిని అమ్ముకున్నారు. చాలా కాలం టీ దుకాణం మూసే ఉంది. ఈ మధ్యనే తిరిగి హోటల్ ప్రారంభించారు. ఆస్తి పన్ను చెల్లించాలంటూ తాజాగా నగరపాలక సంస్థ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. లక్షా 33 వేల 810 రూపాయలు బకాయిలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో ఇంత మొత్తంలో పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. బతకడమే కష్టంగా ఉన్న తాను ఇంత మొత్తం ఎలా చెల్లించాలని వాపోతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 26, 2022, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details