కర్నూలు జిల్లా గూడూరు మండలం మునగాల గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన దస్తగిరి(55) అనే వ్యక్తిపై కొందరు కొడవళ్లతో దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చారు. ఆదివారం రాత్రి ఇంటి వద్దకు వచ్చిన కొందరు.. మాట్లాడాలని బయటకు తీసుకెళ్లి చంపేశారని మృతుడి తల్లి, బంధువులు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్ని మనసులో పెట్టుకుని హత్యకు పాల్పడ్డారని కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితుల ఫిర్యాదుతో అనుమానితలపై కేసు నమోదు చేశామని కోడుమూరు సీఐ శ్రీధర్ తెలిపారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం కోడుమూరు ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కిరాతకం: కొడవళ్లతో నరికి చంపిన దుండగులు
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మునగాల గ్రామంలో వ్యక్తిపై కొడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. హత్యకు పాత కక్షలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో దారుణ హత్య