కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెకు చెందిన వెంకప్ప(40) అనే వ్యక్తి గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. తాడిపత్రి సమీపంలోని చిక్కేపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా అంకిరెడ్డి పల్లె సమీపంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన బాధితుడిని తాడిపత్రికి ఆసుపత్రికి తీసుకెళతుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.
మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో వెంకప్ప మృతి చెందడంతో… ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.