ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లికి వెళుతూ...బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ద్విచక్రవాహనాన్ని...వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో చోటుచేసుకుంది. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.

బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి
బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

By

Published : May 4, 2021, 2:25 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం క్రిష్ణగిరి మెట్ట వద్ద కైపా గ్రామానికి చెందిన మనోహర్ (35) అనే వ్యక్తి బొలెరో వాహనం ఢీకొని మృతి చెందాడు. కైపా నుంచి మనోహర్ ద్విచక్రవాహనంపై గౌతమ్ అనే ఏడేళ్ల కుర్రాడిని వెంటపెట్టుకుని పసుపల గ్రామానికి పెళ్లికి వెళుతున్నాడు. క్రిష్ణగిరి మెట్ట వద్దకు వెళ్లగానే వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది .దీంతో మనోహర్ అక్కడికక్కడే మృతి చెందగా... గౌతమ్ కు స్వల్ప గాయాలయ్యాయి.

వివాహానికి వెళుతూ... ఇలా మృత్యువాత పడడంతో ఆ పెళ్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మనోహర్ భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణ మూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details