తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. రామ్‌నగర్‌లో హారతి అనే యువతిని ఆమె ప్రియుడు షాహిద్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. కాజీపేటకు చెందిన షాహిద్ రామ్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. లష్కర్ సింగారానికి చెందిన హారతి అనే యువతి అతని గదికి రాగా ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి షాహిద్ ఆమెను గొంతు కోసి పరారయ్యాడు.
ప్రేమ వ్యవహారమే కారణం