కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపు రైటర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో హుస్సేన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే రెండు సార్లు తన అన్న కొడుకులు దాడికి దిగారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు వాపోతున్నాడు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘర్షణ.. వ్యక్తికి తీవ్ర గాయాలు - nadyala today latest news update
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపు రైటర్ల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పాత కక్షల కారణంగానే దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
![సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘర్షణ.. వ్యక్తికి తీవ్ర గాయాలు man injurd by the Conflict](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9577145-1022-9577145-1605674379565.jpg)
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘర్షణ వ్యక్తికి తీవ్ర గాయాలు