కర్నూలు జిల్లాలో మూడోవిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పలుచోట్ల అభ్యర్థులు, మద్దుతుదారులు రోడెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. పగిడ్యాల మండలం... ప్రాతకోట సర్పంచ్ ఫలితం లాఠీఛార్జ్‌కు దారితీసింది. ప్రాతకోటలో 7 ఓట్ల మెజార్టీతో శేషమ్మ గెలిచినట్లు అధికారులు ప్రకటించగా ప్రత్యర్థులు రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. కౌంటింగ్ అధికారులు ససేమిరా అనడంతో ఓడిన అభ్యర్థి వర్గం పగిడ్యాల వెళ్లి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. 144సెక్షన్ అమల్లో ఉన్నందున ధర్నా విరమించాలని పోలీసులు కోరారు. ఐనా వారు శాంతించలేదు. ఈ క్రమంలో పోలీసుల లాఠీఛార్జి నుంచి తప్పించుకోబోయి సుధాకర్ అనే వ్యక్తి... కింద పడి చనిపోయినట్లు వైకాపా నాయకులు తెలిపారు. లాఠీఛార్జ్ చేసిన పోలీస్‌లపై చర్యలు తీసుకోవాలంటూ వైకాపా నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సుధాకర్ మృతదేహంతోబైఠాయించారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిప్రాతినిథ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలో పరాజితులు దాడులకు దిగారు. కొచ్చెరువు కౌంటింగ్ కేంద్రంలో ఓడిన అభ్యర్థి ఫ్యాన్‌లు, ట్యూబులైట్లు, ఫర్నీచర్ ధ్వంసం చేయడం.... అధికారులను భయాందోళనకు గురిచేసింది.