కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఆదివారం వేకువజామున తీవ్ర గుండెపోటు వచ్చింది. బంధువులు అతడిని మంచం మీద ఉంచి ఉప్పొంగుతున్న ఒక్కిలేరు వాగును దాటేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో ట్రాక్టర్లో వెళ్లేందుకు యత్నించి విఫలమయ్యారు. చివరకు బాధిత వ్యక్తి అవతలి ఒడ్డుకు చేరలేక... మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. సరైన వంతెన లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
వాగు దాటలేక... ఆసుపత్రికి చేరలేక... మధ్యలోనే వ్యక్తి మృతి - బ్రాహ్మణపల్లిలో గుండెపోటుతో వ్యక్తి మృతి
గుండెపోటుకు గురైన ఓ వ్యక్తిని వాగు దాటించి... ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మధ్యలోనే మృతి చెందాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది.
బ్రాహ్మణపల్లిలో గుండెపోటుతో వ్యక్తి మృతి