ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి - కర్నూలు జిల్లా నేర వార్తలు ట

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఫరూక్ నగర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

నంద్యాలలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి
నంద్యాలలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి

By

Published : Jul 11, 2021, 10:46 PM IST

కర్నూలు జిల్లా మహానంది మండలం శ్రీనగరం గ్రామానికి చెందిన రమేష్.. నంద్యాల మండలం వేంకటేశ్వరపురం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రమేష్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది.

గమనించిన స్థానికులు.. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ రమేష్​ను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details