ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్ - man climbed tower at sikareswaram

శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం వద్ద సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో టవర్ ఎక్కిి దూకేస్తాని బెదిరించాడు.

man created issue by climbing on tower
సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్

By

Published : Sep 7, 2020, 8:29 AM IST

శ్రీశైలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరేశ్వరం వద్ద సెల్ టవర్ ఎక్కి ఒక యువకుడు హంగామా సృష్టించారు. శిఖరేశ్వరం చెంచుగూడేనికి చెందిన మల్లికార్జున.. కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆదివారం సాయంత్రం మద్యం మత్తులో ఎత్తయిన సెల్ టవర్ ఎక్కాడు.

టవర్ చిట్టచివరికి వెళ్లి దూకి వేస్తానంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీశైలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సెల్ టవర్ ఎక్కిన మల్లికార్జున్ ను సురక్షితంగా కిందకు దించారు. అతడిని బంధువులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details