కర్నూలులోని చిత్తారివీధికి చెందిన షేక్ ఫరూక్ భాష(35) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడు షేక్ ఫరూక్ పుట్టుకతో దివ్యాంగుడు. ఏడాది క్రితం పాతబస్టాండులోని నగరపాలక సంస్థకు చెందిన మున్సిపల్ ఓపెన్ థియేటర్ దుకాణ సముదాయంలోని ఓ దుకాణాన్ని సాయి విశ్వనాథ్ నుంచి సబ్ లీజుకు తీసుకున్నాడు. నగరపాలక సంస్థకు అద్దె బకాయి రూ.7.50 లక్షలు చెల్లించటంతో పాటు.. దుకాణం నిర్వహణ కోసం మరో రూ.2.50 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మొత్తాన్ని ఇతరుల వద్ద అప్పుగా తీసుకున్నాడు.
Selfie Suicide: అధికారుల వేధింపులు..దివ్యాంగుడు ఆత్మహత్య ! - కర్నూలు జిల్లా తాజా సమాచారం
కర్నూలు జిల్లాలో ఓ దివ్యాంగుడు సెల్ఫీ సూసైడ్‌కు పాల్పడ్డాడు. మున్సిపల్ అధికారులు షాపును ఖాళీ చేయాలని వేధిస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల నగరపాలక సంస్థ అధికారులు దుకాణం కేటాయించి 25 ఏళ్ల గుడువు ముగిసిందని... మళ్లీ టెండర్ వేసి అద్దెకు ఇస్తామని నోటీసులు జారీ చేశారు. దాంతో దుకాణం నిలబెట్టుకోవటం కోసం నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరిగినా... అధికారులెవ్వరు స్పందించట్లేదని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. అప్పులు ఏలా చెల్లించాలో తెలియక ఈ నెల 22వ తేదీన ఆదృశ్యమయ్యాడు. షేక్ ఫరూక్ భాష కనిపించటంలేదని అతని తల్లి కర్నూలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం తాండ్రపాడు తుంగభద్రనది ఒడ్డున షేక్ ఫరూక్ మృతదేహం లభించింది. దుస్తుల ఆధారంగా కుటుంబసభ్యులు.. ఫరూక్ భాషగా గుర్తించారు. చనిపోక ముందు మృతుడు సేల్ఫీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన కుంటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుడు ఆ వీడియోలో వాపోయాడు. నగరపాలక సంస్థ అధికారుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.
ఇదీ చదవండి