పెద్దకడబూరు మండలంలోని హెచ్.మురవనిలో జయరాముడు(38) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన అతను రోజూ తాగి వచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో ఆమె తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. భార్యను ఇంటికి రావాలని పిలిచినా... ఆమె రాకపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. తన ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందాడు.
భార్య వదిలి వెళ్లిందని ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య - Man commits suicide in H. Muravani news
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలోని హెచ్.మురవనిలో ఓ వ్యక్తి బలవర్మణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఇంటి నుంచి దుర్వాసన రావటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. మూడు రోజుల క్రితం అతను మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: కరోనాతో ఎమ్మెల్సీ, వైకాపా నేత చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత