Man commits suicide at Yemmiganur town police: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట వీరారెడ్డి అనే వ్యక్తి తన పిల్లలతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడే పోలీసులు.. వాళ్లను ప్రమాదం నుంచి తప్పించి పక్కకు తీసుకెళ్లారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వీరారెడ్డి.. తన అత్త వెంకటేశ్వరమ్మ వద్ద రూ. 6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. పలుమార్లు అడిగినా రుణం చెల్లించకపోవడంతో వెంకటేశ్వరమ్మ.. జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక స్టేషన్కు పిలిపించగా... అక్కడికి వచ్చిన వీరారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అప్పు చెల్లించకపోగా.. స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేర కింద వీరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరారెడ్డి.. భార్య హత్య కేసులో నిందితుడు. ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతుంది.
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కేసు నమోదు - కర్నూలు జిల్లా నేర వార్తలు
Kurnool District Crime News: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. వీరారెడ్డి అనే వ్యక్తి తన పిల్లలతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు.. వాళ్లకు నిప్పు అంటుకోకుండా పక్కకు తప్పించారు.
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం