కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వ్యక్తి దుర్మార్గంగా వ్యవహరించాడు. తన వల్ల మోసపోయిన వారిపైనే.. కత్తితో దాడి చేశాడు. కర్నూలు పట్టణంలోని టెక్కే ప్రాంతానికి చెందిన గంగు ఆనంద్.. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. 2017లో కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. బాధితులు వెంటపడినా.. స్పందించలేదు. ఫలితం లేకపోయేసరికి... తిరుపతికి చెందిన సోమశేఖర్, నరేంద్ర అనే వ్యక్తులు ఇంటికి వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగారు. ఆగ్రహించిన గంగు ఆనంద్.. వారిపై కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
నమ్మించి నట్టేట ముంచి.. చివరికి కత్తితో దాడి చేశాడు! - person attack with knife kurnool town tekke news
ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి.. ఓ వ్యక్తి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. తర్వాత తప్పించుకు తిరిగాడు. బాధితులు.. నిందితుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. వారిపైనే ఎదురుతిరిగి కత్తితో దాడి చేశాడు.
man attack with knife in kurnool
TAGGED:
latest crime news in kadapa