ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

cheating: ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు.. రూ.28లక్షలు కాజేశాడు - కర్నూలులో ఉద్యోగం పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

ఆన్​లైన్​లో నగదు చెల్లిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసేవారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ తరహా మోసానికి పాల్పడ్డ వ్యక్తిని కర్నూలు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బాధితుని వద్ద నుంచి రూ.28లక్షలు తీసుకుని పరారైన నిందితుడిని అరెస్టు చేశారు. ఎవరైనా ఉద్యోగాల పేరిట నగదు చెల్లించాలని అడిగితే నమ్మవద్దని పోలీసులు సూచించారు.

arrest
ఉద్యోగం ఇప్పిస్తానని.. రూ.28లక్షలు కాజేసి..

By

Published : Jun 19, 2021, 7:57 PM IST

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. రూ.28 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్థుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు నగరానికి చెందిన సయ్యద్ మక్బూల్ బాషకి.. షైన్ డాట్ కామ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు 2,500 చెల్లిస్తే.. ట్రైనింగ్​కు కాలిఫోర్నియా పంపుతామని.. ఉత్తరప్రదేశ్​కు చెందిన వీరేంద్ర కుమార్ శర్మ పదేపదే ఫోన్ చేసేవాడని బాధితుడు పోలీసులకు తెలిపారు.

విడతల వారీగా బాధితుడు రూ.28 లక్షలు.. శర్మకు పంపాడు. కొద్దిరోజుల తర్వాత మోసపోయానని తెలుసుకున్న మక్బూల్ బాష.. 2018లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కకుండా.. ఉత్తరప్రదేశ్​లో తలదాచుకోగా.. కర్నూలు మూడో పట్టణ పోలీసులు టెక్నాలజీ సహయంతో పట్టుకున్నారని డీఎస్పీ వెంకటరాయమ్య తెలిపారు. ఈ కేసులో రూ.4 లక్షలు రికవరీ చేశామని.. దర్యాఫ్తులో మిగిలిన డబ్బు రికవరీ చేస్తామన్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెబితే.. నమ్మవద్దని డీఎస్పీ వెంకటరాయమ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details