కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు చెందిన రాఘవేంద్ర సింగ్(maisure resident raghavendra singh)... కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి(manthralayam raghavendra swamy) దర్శనానికి వచ్చాడు. మంత్రాలయంలోని హాలీ డే హోం లాడ్జిలో రాఘవేంద్ర సింగ్ బస చేశాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో లాడ్జ్ సిబ్బంది తలుపు కొట్టినా తెరవకపోవడంతో... లాడ్జ్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Suspicious death: రాఘవేంద్రుడి సన్నిధిలో వ్యక్తి అనుమానాస్పద మృతి - kurnool district crime
కర్నూలు జిల్లా మంత్రాలయం(mantralayam)లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు(devotee) అనుమానాస్పద స్థితిలో మృతి(suspicious death) చెందాడు. సెల్ ఫోన్, ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఎమ్మిగనూరు అస్పత్రికి(emmiganore hospital) తరలించారు.
![Suspicious death: రాఘవేంద్రుడి సన్నిధిలో వ్యక్తి అనుమానాస్పద మృతి వ్యక్తి అనుమానాస్పద మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13391398-362-13391398-1634576737841.jpg)
వ్యక్తి అనుమానాస్పద మృతి
పోలీసులు(police) సంఘటన స్థలానికి చేరుకుని గదిని పరిశీలించగా.. రాఘవేంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి(suspicious death) చెంది ఉన్నాడు. సెల్ ఫోన్, ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య సుస్మిత ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఎమ్మిగనూరు(emmiganore) అస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి.