సినీ నటుడు మహేష్ బాబు జన్మదిన వేడుకలను అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జూనియర్ కళాశాలలో కేక్ కోసి, మొక్కలు నాటారు. కర్నూలులో థియేటర్లలో పనిచేసే సిబ్బందికి మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులు.. నిత్యవసర సరకులు అందించారు.
రాజమహేంద్రవరంలో మహేశ్‌బాబు జన్మదినం సందర్భంగా అభిమానులు రక్తదానం చేశారు. వారిని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అభినందించారు. మహేష్ బాబు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు.