కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముగ్గురు ఉద్యోగులు కరోనా బారిన పడినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. దీంతో ఆలయాన్ని ఈనెల 21 నుంచి 26 వరకు మూసివేస్తున్నట్లు ఈవో మల్లికార్జున ప్రసాద్ ప్రకటించారు. భక్తులకు దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. కరోనా బాధిత ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించినట్లు వివరించారు.
మహానంది ఆలయ సిబ్బందికి కరోనా..26 వరకు మూసివేత - మహానంది ఆలయంలో కరోనా న్యూస్
కర్నూలు మహానంది ఆలయ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. బాధిత ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపారు. దీని కారణంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
మహానంది ఆలయ సిబ్బందికి కరోనా