ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలకు విచ్చేసిన మహానందీశ్వర స్వామి - కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రాలు

కర్నూలు జిల్లా నంద్యాల బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు... మహనందీశ్వర స్వామి ప్రతి ఏటా హజరవడం ఆనవాయితీ. ఈసారి కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈనెల 16ల నంద్యాలకు విచ్చేశారు.

Mahanandeshwara Swami came to Nandyala
నంద్యాలకు విచ్చేసిన మహానందీశ్వర స్వామి

By

Published : Oct 24, 2020, 3:08 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు... మహానందిలోని మహనందీశ్వర స్వామి ప్రతి ఏటా హజరవడం ఆనవాయితీ. నంద్యాల బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలకు రావాలని అధికారులు, అర్చకులు మహానంది ఆలయ అధికారులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. వారి పిలుపు మేరకు శ్రీ కామేశ్వరి దేవి సమేత మహనందీశ్వర స్వామి ఉత్సవ మూర్తులు ఈ నెల 16న వతేదీన నంద్యాలకు చేరుకున్నారు. దసరా పర్వదినం వరకు ఆలయంలో ఉండి తర్వాత తిరిగి మహనందికి చేరుకుంటారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో పలు రూపాల్లో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.

ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మహానంది క్షేత్రంలో జరిగే మహనందీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆ ఉత్సవాల్లో స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. ఆ కార్యక్రమానికి నంద్యాల బ్రహ్మానందీశ్వర స్వామి వెళ్లి పెళ్లి పెద్దగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ఇరు స్వాములకు రెండు ప్రదేశాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇలా ఆనవాయితీ కొనసాగుతోంది.

ఇవీ చదవండి: శ్రీశైలంలో నవరాత్రి ఉత్సవాలు.. స్వామిని దర్శించుకున్న మంత్రి జయరాం

ABOUT THE AUTHOR

...view details