కర్నూలు జిల్లా మహానందిలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన మహానందీశ్వరస్వామి ఈ నెల 10వ తేదీ నుంచి భక్తులకు దర్శనమివ్వన్నారు. ఈ నెల 8న ట్రయల్ నిర్వహించి అనంతరం 10 నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. కేవలం లఘుదర్శనం మాత్రమే ఉంటుందని... కోనేటి స్నానం ఉండదని చెప్పారు. ఆలయంలోకి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలన్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి, పిల్లలకు అనుమతి లేదని తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ఆలయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.
భక్తులకు దర్శనమివ్వనున్న మహానందీశ్వర స్వామి! - kurnool district latest news
ఈ నెల 10వ తేదీ నుంచి మహానందిలో ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందీశ్వరస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రతి భక్తుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. కేవలం లఘుదర్శనం మాత్రమే ఉంటుందన్నారు.
ఆలయం పునః ప్రారంభం