కర్నూలులోని శరీన్‌నగర్‌కు చెందిన శివశంకరాచారి (20) ఆత్మహత్య చేసుకున్నాడు. కార్పెంటర్ పనిచేసే వీరబ్రహ్మయ్యాచారికి కుమారుడు, కుమార్తె సంతానం. కృష్ణగిరి మండలం ఎస్‌హెచ్ ఎర్రగుడి స్వగ్రామంకాగా కర్నూలులో స్థిరపడ్డారు. కుమారుడు శివశంకరాచారి కోడుమూరులో ఐటీఐ చదివి తండ్రికి చేదోడుగా ఉండేవాడు. గుంటూరుకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కర్నూలుకు రావడంతో సమీపంలోనే మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడు. తల్లిదండ్రులు నచ్చజెప్పినా వినకుండా ఆమెతోనే ఉండేవాడు. అయితే ఆమెను పోషించడం భారంగా మారడం, వారంరోజుల కిందట ఆమె ఇతన్ని వదిలేసి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన శివశంకరాచారి విషయం తల్లిదండ్రులకు చెప్పి ఆదివారం రాత్రి బయటకు వెళ్లాడు. యువతితో కలిసి ఉన్న ఇంట్లో పంకాకు చీరతో ఉరివేసుకున్నాడు. గమనించిన ఇంటి యజమాని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగుచూసింది. ఇష్టపడిన అమ్మాయి మోసగించిందన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సోమవారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
suicide: అమ్మాయితో సహజీవనం.. మోసగించిందని బలవన్మరణం - కర్నూలులో యువకుడు బలవన్మరణం
అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కోసం మరో ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేశాడు. తల్లిదండ్రులు వద్దని వారించినా వినలేదు. రాను రాను ఆమెను పోషించడం అతడికి భారంగా మారింది. ఆపై ఆమె వదిలేసి వెళ్లిపోవడంతో మనస్థాపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్నూలులో జరిగింది.
love failure suicide in karnulu district