కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మల్లెంపల్లి గ్రామానికి చెందిన 10 మంది మహిళలు గాయపడ్డారు. వీరంతా బ్యాంకు పని మీద బయలుదేరారు. డోన్ జాతీయ రహదారి ఐటీఐ మలుపు వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిలో వీరిలో ముగ్గురు పరిస్థితి విషయంగా ఉంది. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది.
ఆటోను ఢీకొట్టిన లారీ... ముగ్గురి పరిస్థితి విషమం - డోన్ ఐటీఐ జంక్షన్ వద్ద ప్రమాదం
కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఘటనలో 10 మందికి గాయాలు కాగా.. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.
డోన్ ఐటీఐ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం