ఉద్యోగం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న గోపాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లనున్న లోకేశ్.. కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో గోపాల్ కుటుంబ సభ్యులతో సమావేశం కానున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పనున్న లోకేశ్ నిరుద్యోగ యువత చేస్తున్న పోరాటానికి పార్టీ వైఖరిని ప్రకటించనున్నారు.
lokesh visit: రేపు కర్నూలులో లోకేశ్ పర్యటన.. గోపాల్ కుటుంబానికి పరామర్శ - lokesh visit gopal family
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు కర్నూలులో పర్యటించనున్నారు. ఉద్యోగం లేక మనస్తాపంలో ఆత్మహత్య చేసుకున్న గోపాల్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు.
lokesh karnulu visit