కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం నుంచి లాక్డౌన్ కఠినంగా ఉంటుందని కమిషనర్ కృష్ణ, డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. పట్టణ శివారులో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. మాస్కు ధరించకుండా పట్టణంలోకి ఎవరికి అనుమతించమని హెచ్చరించారు. కరోనా బాధితుల కోసం కొవిడ్ కేర్ సెంటర్లో అన్ని వస్తువులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వ్యాపారులు... తమ దుకాణాల్లో వచ్చే వారికి మాస్కులు ఉంటేనే అనుమతించాలని పోలీసులు కోరారు.
'ఆదోనిలో సోమవారం నుంచి కఠినంగా లాక్డౌన్' - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సోమవారం నుంచి ఆదోనిలో కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తామని కమిషనర్ కృష్ణ, డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. పట్టణ శివారులో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

మాట్లాడుతున్న డీ ఎస్పీ